
మోతాదుకు మించి మందులే కారణం కావొచ్చు
ఎయిమ్స్ వైద్యులు
పూర్తయిన అంత్యక్రియలు
న్యూఢిల్లీ, జనవరి 18 (జనంసాక్షి) :
కేంద్ర మంత్రి సునందపుష్కర్ది అసాధారణ మరణమని ఎయిమ్స్ వైద్యులు వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సునంద భౌతిక ఖాయానికి శనివారం ముగ్గురు సభ్యులతో కూడిన వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. సునంద శరీరంపై గాయాలున్నట్లు వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. విషం తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. సునందా పుష్కర్ రెండు రోజుల నుంచి ఆహారమే తీసుకోలేదని తెలుస్తోంది. ఆమె ఆత్మహత్యకు ముందు కేవలం మందు సిగరెట్లతో గడిపారు. తీవ్ర ఆవేదనతో ఉన్న ఆమె మద్యం తాగుతూ.. సిగరెట్లు కాలుస్తూ నిద్రమాత్రలు వేసుకునేవారని తెలుస్తోంది. పాకిస్థానీ జర్నలిస్టు మెహర్ తరార్‌తో తన భర్తకు సంబంధం ఉందని ఆవేదన చెందుతున్న ఆమె, తీవ్రంగా బాధపడినట్లు తెలిసింది. దీనిపై ఆమె ట్విట్టర్ ద్వారా అనేక విషయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. అందుకే తెల్లవారుజామున నాలుగు గంటలకు ఢిల్లీలోని ఒక సీనియర్ మహిళా జర్నలిస్టుకు కూడా ఎస్ఎంఎస్ ఇచ్చి, విూడియాతో చాలా మాట్లాడాల్సి ఉందని అందులో చెప్పారు. సునందా పుష్కర్ రెండు రోజుల నుంచి అసలు ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం మద్యం, సిగరెట్లు, నిద్ర మాత్రలతోనే గడిపేశారన్న విషయాన్ని మంత్రి శశి థరూర్ సిబ్బంది సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్‌కు వివరించారని సమాచారం. కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందాపుష్కర్ అనుమానాస్పదంగా మృతిచెందిన విషయం తెలిసిందే. సోషల్ విూడియా ట్విటర్లో జరిగిన మాటల యుద్ధం చిలికి చిలికి గాలివానగా మారి, చివరకు సునందా పుష్కర్ ప్రాణం తీసిందన్న ఆరోపణలు వస్తున్నాయి.. పాకిస్థాన్ మహిళా జర్నలిస్టు మెహర్ తరార్, కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మధ్య జరిగిన ట్వీట్ల సమరం విషాదానికి దారి తీసింది. ఈ వివాదం ముగిసిందని అందరూ అనుకుంటున్న తరుణంలోనే దారుణం జరిగింది. సునందా పుష్కర్(52) అనుమానాస్పద స్థితిలో ఢిల్లీలోని ఫైవ్ స్టార్ ¬టల్లో శవమై కనిపించారు. లీలా ¬టల్లోని 345 నంబర్ రూములో ఆమె మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కనుగొన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే 345 నంబర్ రూములో ఏం జరిగిందనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ విషం తాలూకు ఆనవాళ్లు ఏవీ కనపడలేదని వారు చెబుతున్నారు. ఆత్మహత్య చేసుకుని ఉంటే నిద్రమాత్రలు మింగారా, ఉరి వేసుకున్నారా, మరే విధంగా అన్న అనుమానాలకు మాత్రం ఢిల్లీ పోలీసులు ఎలాంటి సమాధానాలు ఇవ్వడం లేదు. పాకిస్తానీ జర్నలిస్టు మెహర్ తరార్ కారణంగా భర్తతో ఏర్పడిన మనస్పర్థల వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి. ఆమె మృతదేహానికి ఉదయం 9గంటలకు ఎయిమ్స్‌లో పోస్ట్ మార్టం నిర్వహించారు. సునందా మృతికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్సింగ్, పలువురు ప్రముఖులు సంతాపం మరోవైపు శశిథరూర్‌కు స్వల్పంగా గుండెనొప్పి రావటంతో గతరాత్రి ఆస్పత్రిలో చేరారు. ఎయిమ్స్ అత్యవసర విభాగంలో ఆయనకు వైద్యులు చికిత్స అందించారు. అయితే ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు నిర్ధారించారు. దీంతో శనివారం ఉదయం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శనివారం సాయంత్రం సునంద పుష్కర్ మృతదేహానికి ఢిల్లీలోని లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. శనివారం సాయంత్రం మృతదేహానికి పోస్ట్ మార్టమ్ పూర్తయ్యాక అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని శశిథరూర్‌కు అప్పగించారు. అక్కడి సునందపుష్కర్ మృతదేహాన్ని లోధా రోడ్డు లోని థరూర్ స్వగృహానికి తరలించారు. అనంతరం అంత్యక్రియలు పూర్తిచేశారు.
సునందది అసహజ మరణమే




