అమెరికా అధ్యక్షుడు ఒబామా
బెర్లిన్, జనవరి 19 (జనంసాక్షి) :
ప్రపంచ దేశాలపై అక్రమ నిఘాకు పెద్దన్న అమెరికా కొత్త భాష్యం చెప్పింది. తమ మిత్ర దేశాల భద్రత కోసమే నిఘా పెట్టామంటూ తమ చర్యను సమర్థించుకోజూసింది. విదేశీ ప్రభుత్వాలపై తమ నిఘా కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్ బబామా చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలకు హాని కలిగించే నిఘా వ్యవస్థను మాత్రం అనుమతించబోమని జర్మనీ ఛాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు హామీ ఇచ్చారు. వివాదాస్పద గూఢచర్య కార్యక్రమాన్ని సమర్థించుకున్న ఒబామా.. అమెరికాతో పాటు జర్మనీ సహా మిత్రపక్షాల భద్రత దృష్ట్యా నిఘా అవసరమని తెలిపారు. పత్రికల్లో చదివినట్లుగా నిఘా సంస్థలపై ఆంక్షలు విధిస్తే వాటివల్ల ఉపయోగం ఉండదని జర్మనీకి చెందిన జడ్‌డీఎఫ్ నెట్‌వర్క్‌తో మాట్లాడుతూ స్పష్టం చేశారు. అమెరికా ప్రపంచ వ్యాప్తంగా రహస్యంగా సమాచారం సేకరిస్తున్న విషయాన్ని ఎడ్వర్డ్ స్నోడెన్ వెలుగులోకి తేవడంతో ఒబమా నష్టనివారణ చర్యలకు ఉపక్రమించారు. ఎస్‌ఎస్‌ఏ నిఘా సమాచార సేకరణ సామర్థ్యాలపై ఆంక్షలు విధిస్తే ‘స్నేహపూర్వక దేశాల నేతల’ నిఘాకు ముగింపు పలికినట్లేనని తెలిపారు. తమ మిత్రదేశాల భద్రతను చూసుకోవాల్సిన బాధ్యత కూడా తమపై ఉన్నందునే తాము నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రపంచంలోని పలుదేశాలపై అమెరికా కొనసాగిస్తున్న నిఘా వ్యవహారాన్ని బయటపెట్టిన విషయం తెలిసిందే.
వాహ్ వా! క్యా బాత్ హై (కిక్కర్) మా మిత్ర దేశాల భద్రత కోసమే నిఘా




