Tuesday, 3 November 2026

భత్కల్‌ను విడిపించేందుకు కేజ్రీవాల్‌ కిడ్నాప్‌కు కుట్ర

ఇంటెలిజెన్స్‌ హెచ్చరిక
భద్రత నాకక్కర్లేదు.. ప్రజలివ్వకండి : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) :
ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ను విడిపించేందుకు ఆ సంస్థ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కిడ్నాప్‌నకు యత్నిస్తోస్తున్నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు హెచ్చరించాయి. తనకు భద్రత అవసరం లేదని పదేపదే చెబుతున్న అరవింద్‌ కేజ్రీవాల్‌ వాదనను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఉగ్రవాద సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. దేశంలో పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు కారణమైన ఉగ్రవాది యాసిన్‌ భత్కన్‌ను విడిపించుకునేందుకు ఇండియన్‌ ముజాహిద్దీన్‌ కుట్ర పన్నినట్లు సమాచారం. గతేడాది ఆగస్టు 27వ తేదీన భారత్‌-నేపాల్‌ సరిహద్దుల్లో పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఢిల్లీ పోలీసు సెక్యూరిటీ విభాగం అధికారుల బృందం, ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలిసి ‘జడ్‌’ కేటగిరీ భద్రతకు అనుమతించాలని కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దీనిపై వెంటనే స్పందించలేనని అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నట్లు సమాచారం. ఈ విషయమై తమకు నిఘా వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం ఉందని తెలిపారు. రాజకీయాల్లో విఐసి సంస్కృతికి తెర దించాలన్న ఆమ్‌ఆద్మీ పార్టీ విధానానికి అనుగుణంగా కేజ్రీవాల్‌ భద్రత పొందేందుకు నిరాకరిస్తున్నారు. 2010 ఏప్రిల్‌ బెంగళూర్‌ చిన్న స్వామి స్టేడియం పేలుళ్లకు కారణమైన భత్కల్‌ను విచారించేందుకు కర్ణాటక పోలీసులు శుక్రవారం ఎన్‌ఐఎం న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఉత్తర కర్ణాటక ప్రాంతం ఉడిపి జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వాసి భత్కల్‌. అహ్మదాబాద్‌, సూరత్‌, బెంగళూర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ తదితర నగరాల్లో జరిగిన పేలుళ్లకు కారకుడు నిషేధిత ‘సిమి’ కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *