ముంబాయి: మహరాష్ట్ర ప్రభుత్వం గృహ, వ్యవసాయ రంగాల్లో వినియోగదారులకు విద్యుత్ ఛార్జీలను 15 నుంచి20 శాతం తగ్గించాలని నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ రాణె ఆధ్వర్యంలోని మంత్రుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర కేబినేట్ ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుంది.




