ఎన్నికలెందుకు నిర్వహించారు?
నిజాయితీ గల పోలీసులు ధర్నాలో పాల్గొనండి
ఢిల్లీ గల్లీలో సీఎం కేజ్రీవాల్ ధర్నా
న్యూఢిల్లీ, జనవరి 20 (జనంసాక్షి) :
ఢిల్లీ కమిషనర్‌నే ముఖ్యమంత్రిని చేసుకోండి ఎన్నికలెందుకు నిర్వహించారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్ కేంద్ర ప్రభుత్వానికి నిలదీశారు. ఆప్ ఎమ్మెల్యేపై ఢిల్లీ పోలీసుల దాడిని నిరసిస్తూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర హోం శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించేందుకు సిద్ధపడగా ఆ శాఖ ఉన్నతాధికారులు మరోచోటు చూసుకోవాలని చెప్పారు. కేంద్ర ¬ంశాఖ కార్యాలయం ఎదుట ఆందోళన చేసేందుకు బయలు దేరిన కేజీవ్రాల్‌తో సహా అతని మంత్రివర్గ సభ్యులు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లను ముందుకు కదలనివ్వలేదు. రైల్ భవన్ వద్దనే నిలిపేశారు. వెనక్కి పంపడానికి పోలీసులు ప్రయత్నించారు. అయితే, మనీష్ శిసోడియా, సోమ్‌నాథ్ భారతి అక్కడి నుంచి వెళ్లడానికి నిరాకరించారు. ‘మేం ధర్నా చేయడానికి బయలుదేరాం.. మమ్ముల్ని అడ్డుకుంటే.. ఇక్కడే నడిరోడ్డు మీదే ధర్నాకు కూర్చుంటాం’ అని ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఢిల్లీ పోలీసులను హెచ్చరించారు. కేజ్రీవాల్‌లో పాటు ఆయన మంత్రి వర్గ సభ్యులు అవసరమైతే నార్త్ బ్లాక్ వద్ద ధర్నా చేసుకోవచ్చని పోలీసులు సూచించారు. ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను కూడా కలుసుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే కేజ్రీవాల్ అతని మంత్రి వర్గ సభ్యులు రైల్ భవన్ నుంచి కదలడానికి నిరాకరించారు. అక్కడే ప్రసంగాలు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా కేజీవ్రాల్‌కు వ్యతిరేకంగా మరికొంత మంది నినాదాలు చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో పాటు, మంత్రులను కూడా ధిక్కరించినందుకు ఢిల్లీ పోలీసులపై చర్య తీసుకోవాలని కేజీవ్రాల్ డిమాండ్ చేశారు. అయితే విచారణ తర్వాతే పోలీసులపై చర్యలు తీసుకుంటామని కేంద్ర ¬ంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. అంతేగాకుండా పోలీసులను కేంద్రం నుంచి రాష్ట్రానికి బదలాయించడం కుదరదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి పోలీసు శాఖను మార్చాలని కేజ్రీవాల్ పట్టుబట్టారు. నిజాయితీ గల పోలీసులు ధర్నాలో పాల్గొనాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మహిళల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ఆయన స్పష్టం చేశారు. ధర్నా చేస్తూనే అధికారిక కార్యక్రమాలు నిర్వర్తిస్తానంటూ అక్కడే పలు దస్త్రాలపై సంతకాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, రేస్‌కోర్సు మెట్రో స్టేషన్లను మూసివేయించారు.
ఢిల్లీ కమిషనర్‌నే సీఎం చేయండి




