Tuesday, 3 November 2026

ప్రణబ్‌జీ! గుడువు పొడిగించొద్దు

రాష్ట్రపతికి టీ సభ్యుల వినతి
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి20 (జనంసాక్షి) :
ప్రణబ్‌జీ.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చకు ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించొద్దంటూ తెలంగాణ ప్రాంత నేలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ రాశారు. టి.ముసాయిదా బిల్లుపై చర్చకు గడువును పెంచొద్దంటూ వారు లేఖలో పేర్కొన్నారు. గడువు పొడిగిస్తే తెలంగాణ పక్రియ ఆగిపోతుందనే ఆందోళన ప్రజల్లో ఉందని తెలిపారు. వీటి గురించి సవివరంగా మాట్లాడేందుకు తమకు సమయం కేటాయించాలని వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. టి.నేతలకు రాష్ట్రపతి అపాయింట్‌ మెంట్‌ ఇస్తే.. టిఆర్‌ ఎస్‌, టిడిపి, కాంగ్రెస్‌, సిపిఐ కు చెందిన సుమారు పది మంది తెలంగాణ నేతలు ఒక బృందంగా ఏర్పడి ఢిల్లీకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిన్నటి దాకా చర్చకు అడ్డు తగిలి.. ఇప్పుడు గడువు పెంచమని సీమాంధ్ర నేతలు కోరడం సబబు కాదని ఈ సందర్భంగా వారు ప్రణబ్‌ కు వివరించనున్నారు. ఇదిలావుంటే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో పెద్దపల్లి ఎంపీ, టీఆర్‌ఎస్‌ నేత వివేక్‌ భేటీ అయ్యారు. టీ బిల్లుపై చర్చకు గడువు పెంచొద్దని వివేక్‌ రాష్ట్రపతిని కోరినట్లు సమాచారం. చర్చకు ఆరు వారాల గడువిస్తే ఇప్పటి వరకు కేవలం 22 గంటల పాటు మాత్రమే చర్చ జరిగిందని, మళ్లీ పొడిగించినా అంతకు భిన్నమైన పరిస్థితులు ఏమీ ఉండబోవని ఈ సందర్భంగా వివేక్‌ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. త్వరగా బిల్లును పార్లమెంట్‌కు పంపి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని ప్రణబ్‌కు వివేక్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *