Wednesday, 4 November 2026

దిగొచ్చిన కేంద్రం

ఆ పోలీసు అధికారులపై చర్యలు
ఇది ప్రజా విజయం : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) :
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ధర్నాతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులను దీర్ఘకాలిక సెలవుపై వెళ్లమని ఆదేశించింది. ఈమేరకు కేజ్రీవాల్‌తో చర్చలు జరిపిన ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌పై వారిపై తీసుకున్న చర్యను వివరిస్తూ ధర్నా విరమించాలని కోరారు. మహిళల రక్షణ కోసమే తమ ఆరాటమని కేజ్రీవాల్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. గణతంత్ర స్ఫూర్తిని తాము గౌరవిస్తామని రైల్‌ భవన్‌ సమీపంలో నాలుగు రోజుల్లో గణతంత్ర దినోత్సవం నిర్వహించనున్నందున దీక్ష విరమిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు ఆప్‌ దీక్ష సందర్భంగా పోలీసులు, ఆప్‌ కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో 19 మంది పోలీసులతో పాటు 30 మంది గాయపడ్డారు. వారిని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రికి తరలించారు.
సోమవారం ధర్నా ప్రారంభించిన కేజ్రీవాల్‌ రెండోరోజు కూడా ధర్నా కొనసాగించారు. వర్షంలో కూడా ఆయన దీక్షను కొనసాగించారు. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక దీక్ష చేపడతానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ సమన్వయకర్త అరవింద్‌కేజీవ్రాల్‌ స్పష్టం చేశారు. మంత్రుల ఆదేశాలను పట్టించుకోని పోలీసులను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ కేజీవ్రాల్‌, మంత్రులు రైల్‌భవన్‌ వద్ద చేపట్టిన ధర్నా రెండో రోజుకు చేరింది. రైల్‌ భవన్‌ వద్ద ఏర్పాటు చేసిన బారీకేడ్లను తొలగించేందుకు ప్రయత్నించిన కేజీవ్రాల్‌, ఆప్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. అయితే అకస్మాత్తుగా కురిసిన వానలో కార్యకర్తలు నృత్యం చేస్తూ పాటలు పాడుతూ కేందప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లాస్టిక్‌ షీట్ల కింద వర్షం నుంచి కొందరు తలదాచుకున్నారు. అనారోగ్యంగా ఉన్న కేజీవ్రాల్‌ కాసేపు కారులో కూర్చుని విశ్రాంతి తీసుకున్నారు. మధుమేహం సమస్య ఉన్న కేజీవ్రాల్‌ను ఉదయం వైద్యులు ఒకసారి పరీక్షించారు. రాత్రి పేవ్‌మెంట్‌ విూద తన కారు పక్కనే పడుకున్న కేజీవ్రాల్‌కు రక్షణగా సీఆర్‌పీఎఫ్‌ పోలీసులు బందోబస్తు విధులు నిర్వర్తించారు. పదిరోజులు ధర్నా కొనసాగిస్తానన్న కేజీవ్రాల్‌ ఆ మాటకు అర్థం నిరవధికమని పేర్కొన్నారు. జనవరి 26 వరకు తమ డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోతే అప్పుడు లక్షలాది సాధారణ ప్రజానీకంతో రాజ్‌పథ్‌ని నింపేస్తామని పేర్కొన్నారు. ఆప్‌ కార్యకర్తలు పెద్దఎత్తున ధర్నా స్థలానికి తరలిరావడానికి వీల్లేకుండా పోలీసులు పలు బారికేడ్లు ఏర్పాటుచేశారు. తాము ఈ ప్రాంతాన్ని కావాలని ఎంపిక చేసుకోలేదని, కేంద్ర ¬ంమంత్రిత్వ శాఖ కార్యాలయం వైపు వెళ్తుండగా పోలీసులు ఇక్కడ ఆపడంతో ఇక్కడే ధర్నా చేస్తున్నామని పార్టీ నేత యోగేంద్ర యాదవ్‌ అన్నారు. ఆందోళన చేస్తున్న తమకు అసౌకర్యం కలిగించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల భవనాల్లో టాయ్‌లెట్లను వినియోగించే వీలు లేకుండా బారికేడ్లు ఏర్పాటుచేయించారని కేజీవ్రాల్‌ షిండేపై విరుచుకుపడ్డారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు కేంద్ర ¬ంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ఆ శాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. కేజీవ్రాల్‌ ఆందోళనకు దిగిన రైల్వేభవన్‌ వద్ద పరిస్థితిని పోలీసు అధికారులు షిండేకు వివరించారు. దీక్ష కారణంగా శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం అవుతోందని అన్నారు. రైల్‌ భవన్‌ వద్ద ఆందోళన చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలపైన పోలీసులు లాఠీచార్జి చేశారు. ఢిల్లీ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన చేస్తున్న ప్రదేశం చుట్టూ ఏర్పాటు- చేసిన బారికేడ్లు తొలగించేందుకు ఆప్‌ కార్యకర్తలు ప్రయత్నించారు. దాదాపు మూడు వందల మంది కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకురావడంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలు స్పృహ కోల్పోయారు. ఒక కార్యకర్త గాయపడటంతో పోలీసులు అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిని సిఎం కేజ్రీవాల్‌ పరామర్శించారు. డ్రగ్స్‌, వ్యభిచార రాకెట్‌పై దాడి చేయడానికి నిరాకరించిన పోలీసులపై చర్య తీసుకోవాలన్న డిమాండ్‌తో రైలు భవన్‌ ఎదుట నడి రోడ్డు మీదనే అరవింద్‌ కేజీవ్రాల్‌ రాత్రంతా పడుకున్న విషయం తెలిసిందే. ఇదిలావుంటే ఢిల్లీ సిఎం వ్యవహారం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. దీంతో కొందరు ఆయనకు మద్దతు ఇవ్వడం సరైంది కాదన్నారు. మద్దతును వెంటనే వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్‌కు ప్రతిపాదన చేశారు. అందుకే పోలీసుల వ్యవహార శైలిని నిరసిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ ఆందోళనకు దిగడంపై కాంగ్రెస్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీకి మద్దతు కొనసాగింపుపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. కేజీవ్రాల్‌ రాజ్యాంగాన్ని, పౌరులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. కేజీవ్రాల్‌ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదని అన్నారు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ చేస్తున్న ఆందోళనలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఢిల్లీలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నా.. కేజీవ్రాల్‌ చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఢిల్లీ న్యాయ శాఖ మంత్రి సోమనాథ్‌ భారతి అర్ధరాత్రి కిర్కి గ్రామంలో ఆకస్మిక దాడులు చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించాడన్ని కూడా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ధర్నాను బిజెపి కూడా తప్పుపట్టింది. సీఎంగా పనిచేయలేక ఆందోళనకుదిగారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *