బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన
న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీ ఉనాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తాను సిద్ధమని భాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్ డైరక్టర్ ప్రభు చావ్లా ఐబీఎన్7 టివీ చానల్‌లో నిర్వహిస్తున్న ”టీఖీ బాత్” కార్యక్రమంలో రాహుల్ గాంధీని బాలీవుడ్ సూపర్ స్టార్ ఆకాశానికి ఎత్తేశారు. ఇతర రాజకీయ నాయకులు బాగా పనిచేస్తున్నా కూడా వారందరిలోకి రాహుల్ పిలిస్తే ఎక్కడైనా, ఎప్పుడైనా ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని సల్మాన్ తెలిపారు. ఒక నేతగా రాహుల్ అంటే తనకు ఇష్టమని తన సాయం ఎప్పుడు అవసరమైనా ఆయన కోసం ప్రచారం చేయడానికి బాలీవుడ్ సూపర్‌స్టార్ సుముఖత వ్వక్తం చేశారు. మరి సంక్రాంతి రోజున గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి గాలిపటాలు ఎగరేశారు కదా? అని ప్రశ్నించగా గుజరాత్‌లో మోడీకి నాతో పనిలేదు. అక్కడ ఆయన చాలా ప్రజాదరణ ఉన్న నాయకుడు అని సల్మాన్ చెప్పుకొచ్చారు. గుజరాత్‌లో ఆయనకు ఉన్న ప్రజాదరణను తాను ప్రత్యక్షంగా చూశాను కనుక అక్కడ మోడీ తరపున తాను ప్రచారం చేయాల్సిన అవసరం లేదని సూపర్‌స్టార్ తెలిపారు. రాహుల్ గాంధీ అంటే నాకు ఇష్టం ఆయన రమ్మంటే ఆయన తరపున పక్కాగా ప్రచారం చేస్తా అని సల్మాన్ చెప్పారు.
రాహుల్ రమ్మంటే ప్రచారానికి సై




