Wednesday, 4 November 2026

అసెంబ్లీ పదిహేనునిమిషాలు వాయిదా

హైదరాబాద్‌,జనవరి 24 : అసెంబ్లీలో వైకాపా తీరు మారకపోవడంతో శుక్రవారం కూడా సభ ప్రారంభం కాగానే పదిహేను నిముషాలు వాయిదా పడింది. స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన వైకాపా సభ్యులు నినాదాలు చేయడంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను వాయిదా వేశారు. అంతకుముందు వారు ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిర్సకరించారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించేందుకు వారం రోజులపాటు అదనపు గడువునిచ్చారు. అయితే ఈసమయాన్ని కూడా వినియోగించుకునేందుకు సభ్యులులేకపోవడం శోచనీయమన్నారు. అదనపు సమయం ఇచ్చిన తర్వాత శుక్రవారం ప్రారంభమైన తొలి రోజున కూడా వైసిపి నిన్న మొన్నటిలాగే అదే పాత పద్దతిని పాటించింది. సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ స్థానంలోకి వైసిపినేతలు పోడియంలోకి దూసుకుపోయి ఓటింగ్‌ నిర్వహించాల్సిందేనంటూ పట్టు బట్టారు. బిఎసిలో తీసుకున్న నిర్ణయం వైసిపి పక్షాననేత ఉపనేతకూడా ఉన్నారని వారికిఅంతా తెలిసినాకూడా సబ్యులు ఇలా చేయడం దుర్మార్గమే అవుతుందని చీఫ్‌విప్‌ గండ్ర అన్నారు. ఇంకా చాలా మంది మాట్లాడాల్సి ఉందని నాదెండ్ల మనోహర్‌ చెప్పినా కూడా పట్టించుకోకుండా నినాదాలు చేస్తూనే వచ్చారు. ఈక్రమంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డికి మాట్లాడుతూ ప్రతి రోజు ఇలాగే చేయడం దుర్మార్గమన్నారు. బిఎసిలో సుమారు రెండుగంటలకుపైగా చర్చించి విధివిధానాలు నిర్ణయించడం జరిగిందన్నారు. ఆసమయంలో సమావేశం లో ఉన్నా కూడా నేడు విరుద్దంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. సభ్యులు అందరు సహకరించి ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరారు. ఆందోళనలు మానుకుని రాష్ట్రపతి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అయినా కూడా సభ్యులు ఓటింగ్‌పై ప్రకటన చేయాలని నినాదాలు చేస్తుండడంతో చేసేదేమి లేక పోవడంతో స్పీకర్‌ నాదెండ్లమనోహర్‌ సభను పదిహేను నిమిషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *