Wednesday, 4 November 2026

వలస జిల్లాపై వివక్ష చూపిస్తున్నారు :రాములు

హైదరాబాద్‌,జనవరి 24 : తెలంగాణా ఏర్పాటుకోసం అరవై ఏళ్లుగా పోరాటాలు చేస్తూ వచ్చారని, ఇందులో సుమారు 1200మంది యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్న ఫలితంగానే నేడు విభజన బిల్లును రాష్ట్రపతి పంపించారని మాజీ మంత్రి మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే బి రాములు పేర్కొన్నారు. విభజన బిల్లుపై శుక్రవారం ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లలో తెలంగాణాను పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారని ఆరోపించారు. దీనివల్లే ఉద్యమాలు ఆరు దశాబ్దాలుగా సజీవంగానే ఉన్నాయన్నారు. ప్రపంచంలో ఎక్కడా కూడా పోరాటాలుచేసి ప్రాణాలు కోల్పోయారేతప్ప కేవలంతెలంగాణాలోనే నిరాశతో ఆత్మబలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. ఇంతకాలం కలిసి ఉన్నవారం విడిపోయి అన్నదమ్ముల్లా కలిసి ఉందామన్నారు. తెలంగాణాకు టిడిపి అనుకూలమే, ఏనాడు వ్యతిరేకించలేదన్నారు. సకల జనులసమ్మె సమయంలోనే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన బిక్ష వల్లేఅసెంబ్లీకి వచ్చాను. పశువుల కాపరిగా ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం టిడిపి ఆదరించడం వల్లే జరిగిందన్నారు. బిసి బలహీన బడుగువర్గాలకు అన్నం పెట్టిన పార్టీ టిడిపియేనన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతీకగానే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాబోతుందన్నారు. ఈక్రమంలో రాములు చంద్రబాబును ముఖ్యమంత్రి అని సంబోదించడంతో ప్రభుత్వ చీప్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి సలహా ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే రాములుతోపాటు ఇతర టిడిపి నేతలు ప్రతిఘటించారు. దీంతో స్పీకర్‌ గండ్ర వెంకటరమణారెడ్డికి మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో ఆయన మాట్లాడుతూ రాములు అంటే తనకు గౌరవం ఉందన్నారు. తాను ఉపన్యాసాన్ని అడ్డుకోలేదన్నారు. కేవలం చంద్రబాబు నాయుడు నేడు ముఖ్యమంత్రిగా లేడని చెప్పేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే దానిని అడ్డుకుంటున్నానని చెప్పుతూ రాద్దాంతం చేయడం సరైంది కాదన్నారు. వారు మాట్లాడుతూ మహబూబ్‌నగర్‌ జిల్లాకు అన్యాయం జరిగిందనడం శోచనీయమన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాను చంద్రబాబు నాయుడు సిఎంగా ఉన్నప్పుడు దత్తత తీసుకుని ఏంచేశాడో గుర్తు చేసుకోవాలన్నారు. దానివల్లే నేడు ఈదుర్గతి పట్టిందని గుర్తిస్తే మంచిదన్నారు. పార్టీ కోణంలో సవరించేందుకు ప్రయత్నించానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *