Wednesday, 4 November 2026

వైకుంఠం టిక్కెట్ల అక్రమాలపై తలసాని పిటిషన్‌

హైదరాబాద్‌,జనవరి24: తిరుమల వీఐపీ టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలపై టిడిపి సీనియర్‌ నేత తలసాని శ్రీనివాసయాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున వీఐపీ టిక్కెట్ల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని, ఏ ¬దాలో సీఎం సోదరుడు శ్రీవారిని తొలుత దర్శనం చేసుకున్నారో విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి ఛైర్మన్‌, జేఈవో, దేవాదాయ కమిషనర్లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఆనాడు ఎందరో దర్శనం కాక ఆందోళనకు దిగిన విషయాన్ని తలసాని గుర్తుకు తెచ్చారు. భక్తులను కాదని కేవలం విఐపిలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారని పిటిసన్‌లో ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *