అసలు బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుంది
కసరత్తు పూర్తి చేస్తోన్న హోం శాఖ
క్లారిటీ ఇచ్చిన షిండే
న్యూఢిల్, జనవరి 25 (జనంసాక్షి) :
అసెంబ్లీకి పంపేది డ్రాఫ్ట్ బిల్లేనని, అసలు బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే స్పష్టం చేశారు. మరోవైపు హోం శాఖ తెలంగాణ ముసాయిదా బిల్లుపై పూర్తి స్థాయిలో కసరత్తు సాగిస్తోంది.. శనివారం కేంద్ర ¬ం మంత్రి సుశీల్‌కుమార్ షిండే కేంద్ర¬ంశాఖ ముఖ్య అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన బిల్లుపై జరుగుతున్న చర్చను జాగ్రత్తగా గమనిస్తున్నారు. తెలంగాణ బిల్లును ఫిబ్రవరి 11న లోక్‌సభలో, 12న రాజ్యసభలో ప్రవేశపెట్టే విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. బిల్లు ఎలా వచ్చినా ఫర్వాలేదని ఇప్పటికే దిగ్విజయ్ సింగ్ ప్రకటించిన నేపథ్యంలో బిల్లు తిప్పిపంపాలన్న సిఎం నిర్ణయాన్ని కూడా ¬ంశాఖ పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది. కేవలం డ్రాఫ్ట్ బిల్లును మాత్రమే పంపుతారని, బిల్లును పార్లమెంట్‌కు మాత్రమే పంపుతామని ¬ంశాఖ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ నెల 30 వరకు తెలంగాణ బిల్లుపై శాసనసభలో చర్చకు రాష్ట్రపతి గడువు పొడిగించిన విషయం తెలిసిందే. 30తో శాసనసభలో చర్చ ముగుస్తుందని, అక్కడి నుంచి మూడు రోజుల లోపల అంటే ఫిబ్రవరి మూడవ తేదీ లోపల బిల్లుపై నివేదిక కేంద్ర ¬ంశాఖకు పంపించాల్సి ఉంటుందని, అక్కడి నుంచి రాష్ట్రపతికి వెలుతుందని, ఈ పక్రియ అంతా పది రోజులు పడుతుందని కేంద్ర¬ంశాఖ భావిస్తోంది ఇదిలావుంటే, అన్ని పార్టీలు అంగీకరించిన తర్వాతనే కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుందని ఎఐసిసి వర్గాలంటున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి 15 తేదీల మధ్య తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని కూడా కేంద్రం జాగ్రత్తగా గమనిస్తోంది. ఆయన ధిక్కార స్వరం ఎంతవరకు అన్నది కూడా అంచనా వేస్తున్నారు. మరోవైపు సిఎం పార్టీ పెడతారన్న దానిపైనా ఆరా తీస్తున్నారు. సిఎం వైఖరి ఇలాగే కొనసాగితే ఆయనకు తగిన సమయంలో ఉద్వాసన పలకడం ఖాయమని కూడా ఎఐసిసి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి లాభం చేకూరుతుందని కూడా అంచనా వేస్తున్నాయి. తెలంగాణలోనూ సీమాంధ్రలోనూ కాంగ్రెసు నేతలు బలహీనపడ్డారని ఏఐసీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను సరిగా ఎదుర్కోలేకపోతున్నారని అంచనా వేస్తున్నాయి. మొత్తంగా ఏపీ వ్యవహారాలను సోనియా జాగ్రత్తగా గమనిస్తున్నారని తెలుస్తోంది.
అసెంబ్లీకొచ్చేది డ్రాఫ్ట్ బిల్లే





