Tuesday, 3 November 2026

సీఎం నోటీసుపై ‘టీ’ సభ్యుల ఫైర్‌

పోడియం ముందుకు ‘టీ’ మంత్రులు
సభ నేటికి వాయిదా
హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి): సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణకు చెందిన సభ్యులు, మంత్రులు పోడియంవైపు దూసుకువచ్చి సభను స్తంభింపజేశారు. సీ.ఎం. లేఖ సృష్టించిన కలకలంతో అసెంబ్లీలో పోటాపోటీ నినాదాలతో ¬రెత్తింది. తొలుత రెండుసార్లు వాయిదా అనంతరం ప్రారంభమైన శాసనసభలో సభ్యుల ఆందోళన కొనసాగింది. సమావేశం ప్రారంభంకాగానే స్పీకర్‌ పోడియం వద్ద తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సీఎం నోటీసును తిరస్కరించాలంటూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఉపముఖ్యమంత్రి దామోదరం రాజనరసింహ సైగతో మంత్రులు పోడియంవైపు దూసుకెళ్లి ధర్నా చేశారు. మరోవైపు సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. మంత్రులే ఇలా పోడియంలోకి రావడం తగదన్నారు. విూరంతా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారని అన్నారు. ఇలా చేయడం తగదన్నారు. సభ నిర్వహణకు సహకరించాల్సిందిగా స్పీకర్‌ సభ్యులను ఎంతగా కోరినా ఫలితం లేకపోవడంతో సభాపతి నాదెండ్ల మనోహర్‌ సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. ఇదిలావుంటే సోమవారం ఉదయం నుంచి కలకలం చెలరేగింది. అసెంబ్లీకి వచ్చిన విభజన బిల్లును తిరస్కరించి పంపాలన్న సిఎం లేఖతో అసెంబ్లీలో కలకలం చెలరేగింది. గందరగోళం చెలరేగింది. మంత్రులు కూడా పోడియంలోకి దూసుకుని వెళ్లి నిరసన తెలపడం సోమవారం విశేషంగా చెప్పుకోవచ్చు. సభ సోమవారం సమావేశం కాగానే తొలుత అరగంట ఆతరవాత సమావేవమయ్యాక గంటసేపు వాయిదా పడింది. ఇక మండలిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడా తెలంగౄణ ఎమ్మెల్సీలు లేఖకు ఇరసనగా నినాదాలు చేశారు. సభ జరుపుకుందామని, 30 లోపు బిల్లుపై చర్చచేసి పంపాలని మండలి ఛైర్మన్‌ అన్నప్పటికీ వినకపోవడంతో అరగంట వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ చక్రపాణి ప్రకటించారు. ఇక అసెంబ్లీలో అనూహ్యంగా తెలంగాణ మంత్రులు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం విశేషం. గతంలో ఎప్పుడు ఇలాంటి ఘటన జరిగి ఉండదు. రాష్ట్ర విభజన అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి దుర్మార్గంగా రూల్‌-77 క్రిందబిల్లును తిప్పిపంపాలని నోటీస్‌ ఇవ్వడాన్ని తప్పుపడుతూ తెలంగాణ వాదులు, ఈనోటిస్‌పై చర్చించి ఓటింగ్‌ చేపట్టాలని సమైక్యవాదులు, మొత్తం బిల్లుపైన ఓటింగ్‌కోసం వైసిపి నేతలు డిమాండ్‌ చేస్తూ స్పీకర్‌ పోడియంలోకి వెళ్లి నినాదాలిచ్చారు. అసెంబ్లీ సోమవారం ప్రారంభంకాగానే స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఇంకా ఎలాంటి ప్రకటనచేయకముందే తెలంగాణకు చెందిన ఎర్రబెల్లిదయాకర్‌రావుతో పాటు టిడిపి, టిఆర్‌ఎస్‌ నేతలు, బిజెపి నేతలు పోడియంలోకి వెళ్లారు. వీరికి ముందే సీమాంధ్రకు చెందిన వివిధపార్టీల నేతలు కూడా స్పీకర్‌ పోడియంలోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో సహకరించాలని స్పీకర్‌ ఎంత కోరినా కూడా పట్టించుకోలేదు. చర్చలో పాల్గొనాలని స్పీకర్‌ కోరారు. మరోవైపు కొందరు మంత్రులు కూడా పోడియంలోకి దూసుకుని వెళ్లారు. ఈ నినాదాల మద్యే స్పీకర్‌ టిడిపి ఇచ్చిన కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఖరిపై వాయిదా తీర్మాణాన్ని, ఇటు బిల్లుపై ఓటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేస్తూ వైసిపి ఇచ్చిన వాయిదా తీర్మాణాలను కూడా తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సభ్యులను చర్చలో పాల్గొనాలని కోరారు. ఎవరి సీట్లలోకి వారు వెళ్లితే అనేక అంశాలు చర్చిస్తామన్నారు. చర్చలో పాల్గొని తమతమ అభిప్రాయాలను వెల్లడించాలని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పదే పదే కోరినా కూడా పరిస్థితి అదుపులోకిరాకపోవడంతో సభను అరగంట వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి వెల్లిపోయారు. అనంతరం సభ ప్రారంభమయ్యాక కూడా ఇదే పరిస్థితి నెలకొంది. శాసనసభలో సభ్యుల ఆందోళనలు కొనసాగాయి. దీంతో శాసనసభ సమావేశాలు మళ్లీ గంటపాటు వాయిదా పడ్డాయి. వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో టీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. మంత్రులు డి.కె. అరుణ, శ్రీధర్‌ బాబు, సునీతా లక్ష్యారెడ్డి, జానారెడ్డి సీఎం డౌన్‌ డౌన్‌, జై తెలంగాణ నినాదాలతో సభను ¬రెత్తించారు. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న నోటీసును తిరస్కరించాలని సభ్యులు పట్టుబట్టారు. ప్రభుత్వంలో భాగమైన మంత్రులు ఆందోళన చేయడం సరికాదని తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్‌ విజ్ఞప్తిచేశారు. అయినా ఇదివరకే డిప్యూటీ సీఎం దామోదర ప్రకటించినట్టుగా టీ సభ్యులందరూ కలిసికట్టుగా ఉంటూ ఆందోళనను కొనసాగించారు. చేసేదిలేక స్పీకర్‌ సభను గంటపాటు వాయిదా వేశారు. ఒకసారి వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభంకాగానే స్పీకర్‌ పోడియం వద్ద తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. సీఎం నోటీసును తిరస్కరించాలంటూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. మంత్రులు పోడియం వద్దకు రావడం తగదన్నారు. వారు ప్రభుత్వంలో భాగమన్న విషాయన్ని గుర్తుంచుకోవాలని స్పీకర్‌ అన్నారు. అయినా సభ్యులు తెలంగాణ నినాదాలతో ¬రెత్తించారు. దీంతో భ్యులు శాంతించకపోవడంతో స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సభను గంట పాటు వాయిదా వేశారు. మండలి సమావేశం కాగానే సభ్యులు నిరసనలు వ్యక్తం చేశారు. రామచంద్రయ్య ఇచ్చిన లేఖపై తెలంగాణ నేతలు మండిపడ్డారు. దానిని తిరస్కరించాలని కోరారు. మరోవైపు లేఖ ఆధారంగా బిల్లును తిప్పి పంపాలని సీమాంధ్ర ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. దీంతో ఛైర్మన్‌ సభను అరగంట వాయిదా వేశారు. తరువాత కూడా సభ్యులు శాంతించక పోవడంతో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *