Tuesday, 3 November 2026

తనిష్క్‌ చోరీ నేనే చేశానంటూ లొంగిపోయిన నిందితుడు

పైలట్‌ అయ్యేందుకే కన్నం వేశాడు : సిపి అనురాగ శర్మ

హైదరాబాద్‌, జనవరి27 (జనంసాక్షి) : తనిష్క్‌ చోరీ తానే చేశానంటూ ఓ యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేందుకే తానీ దొంగతనానికి పాల్పడ్డానని చెప్పాడు. సోమవారం అత్యంత నాటకీయపరిణామాల మధ్య జరిగిన ఈ లొంగుబాటు వివరాలు ఇలా ఉన్నాయి. తనిష్క్‌ బంగారం దుకాణంలో చోరీ వ్యవహారం అనేక మలుపులు తిరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు దొంగతనంతో సహా లొంగిపోయేవరకు పరిణామాలను కమిషనర్‌ అనురాగశర్మ వివరించారు. కిరణ్‌ అనే యువకుడిని విచారించామని నగర పోలీస్‌ కమిషనర్‌ సీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు వికలాంగుడిగా నటించాడని సీపీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగలను, కిరణ్‌ను సోమవారం విలేకర్ల ముందు ప్రవేశ పెట్టారు. సీసీ పుటేజ్‌ ని పరిశీలించిన అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. దుకాణంలో కి ప్రవేశించిన అనంతరం లైట్లను ఆఫ్‌ చేసి చోరీకి పాల్పడ్డారన్నారని సీపీ తెలిపారు. సీసీ పుటేజ్‌ లో ఉన్న మరోవ్యక్తి కిరణ్‌ రూమ్‌ మేట్‌ గా తేలిందన్నారు. అతని పేరు ఆనంద్‌ అని కిరణ్‌ తెలిపాడన్నారు. ఈ ఘటనలో రూ. 23 కోట్ల విలువైన 30 కిలోల బంగారం చోరీకి గురయిందన్న యాజమాని ఫిర్యాదుతో దర్యాప్తు ఆరంభించామన్నారు. ప్రస్తుతం 5.98 కోట్ల విలువైన 15.97
కిలోల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు. నగల దుకాణం యజమాని చెప్పినట్లు- చోరీ గురయిన ఆభరణాల విలువ రూ.23 కోట్లు- ఉండదన్నారు. చోరీకి పాల్పడిన విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉందన్నారు. 24 వ తేదీ అర్ధరాత్రి దుకాణానికి కన్నం పెట్టి చోరీ చేసారన్నారు. చోరీ చేసే సమయంలో పూర్తి జాగ్రత్తలు పాటించారన్నారు. దీనికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదన్నారు. ఆభరణాలను రసూల్‌ పూర్‌ లో దాచినట్లు- సీపీ తెలిపారు. కాగా బంగారంలోంచి ఒక ఉంగరాన్ని విక్రయించరన్నారు.ఈ చోరీతో సంబంధమున్న ఆనంద్‌ అనే వ్యక్తి ఇంకా దొరకలేదన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ సవిూపంలోని ఈపూరుకు చెందిన అతడు పోలీసులకు లొంగిపోయే ముందు ఓ వార్తా చానల్తో మాట్లాడాడు. రాత్రి 2 నుంచి 4 గంటల మధ్య చోరీ చేసినట్టు- తెలిపాడు. పక్కా ప్రణాళికతో దొంగతనం చేసినట్టు- వెల్లడించాడు. చేతులకు, కాళ్లకు ప్లాస్టిక్‌ కవర్లు తొడుక్కుని వెళ్లినట్టు చెప్పాడు. పోలీసు జాగిలాలు గుర్తించకుండా సంఘటనా స్థలంలో కారంపొడి చల్లినట్టు- చెప్పాడు. వ్యవస్థపై మండిపాటుతో కళ్లు తెరిపించాలనే ఈ సాహసానికి ఒడిగట్టినట్లు నిందితుడు తెలిపాడు. ఈ సందర్భంగా కమిషనర్‌ అనురాగ్‌ శర్మ మాట్లాడుతూ రూ. 19.20 కోట్ల విలువైన బంగారం చోరీ అయిందని దుకాణం యజమాని ఫిర్యాదు చేశారని, రూ. 5.57 కోట్ల విలువైన 15.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మరో నిందితుడు ఆనంద్‌ కొంతబంగారం పట్టుకుని హైదరాబాద్‌ నుంచి పారిపోయాడని కమిషనర్‌ తెలిపారు. దుకాణంలో సీసీ కెమెరాలు ఉన్నాయని దొంగలకు తెలుసని, అందుకే విద్యుత్‌ దీపాలు పగలగొట్టారని ఆయన చెప్పారు. దొంగలు తమంతట తాము లొంగిపోయేందుకు సిద్ధపడ్డారని, వారు గుంటూరు జిల్లా ఈపూరు వాసులని కమిషనర్‌ తెలిపారు. కిరణ్‌కు పైలట్‌ కావాలని కోరికని, అది నెరవేరాలంటే రూ. 15 లక్షలు అవసరమని చోరీకి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. ఆనంద్‌ దగ్గరున్న నగలు మినహా మిగతా బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. ఆనంద్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేశామని సీపీ తెలిపారు. తనిష్క్‌ దుకాణంలో 2009లో మరమ్మతులు జరిగాయని, నిందితులు తాపీ, వైరింగ్‌ తదితర పనుల్లో నిపుణులని సీపీ పేర్కొన్నారు. నిందితుల గత చరిత్రపై విచారణ చేయాల్సి ఉందన్నారు. దొంగతనానికి పాల్పడింది కిరణెళినని, కన్నం వేయడం నుండి లొంగిపోవడం వరకు పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగిందని నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ చెప్పారు. కిరణ్‌ తన కజిన్‌ బ్రదర్‌ ఆనంద్‌తో కలిసి చోరీకి పాల్పడ్డాడని చెప్పారు. చోరీకి పాల్పడిన వారిలో కిరణ్‌, ఆనంద్‌తో పాటు- ఎవరైనా ఉందా విచారణలో తేలుతుందన్నారు. నిందితులు శానిటేషన్‌ పైప్‌ లైన్‌ వర్కర్లు కాబట్టి ఆ అనుభవంతో రెక్కీ నిర్వహించి రెండు రోజుల ముందు నుండే గోడకు కన్నం వేయడం ప్రారంభించారని చెప్పారు. షోరూం లోపల సిసి కెమెరాలు ఉంటాయని తెలిసి వారు విద్యుత్‌ దీపాలను పగుల గొట్టారని చెప్పారు. పోలీసులను తప్పు దోవ పట్టించేందుకు వారు వికలాంగుడిగా నటించారని చెప్పారు. దొంగతనం జరిగాక విూడియా, పోలీసుల హడావుడి ఎక్కువ కావడంతో భయపడిన నిందితులు లొంగిపోయేందుకు సిద్ధపడ్డారని చెప్పారు. ఆనంద్‌ కొంత బంగారం తీసుకొని వెళ్లిపోగా, మిగిలిన దాంతో కిరణ్‌ లొంగిపోయాడని చెప్పారు. ఆనంద్‌ కోసం వెదుకుతున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు ఈ దొంగతనంలో ఉన్నట్లు- తేలిందని, ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది విచారణలో తేలుతుందన్నారు. తాము సెక్యూరిటి లోపంపై దృష్టి సారించామని చెప్పారు. రెక్కీ నిర్వహించి, అందరు కళ్లు గప్పి రెండు రోజుల ముందు నుండే కన్నం వేయడం ప్రారంభించి, విద్యుత్‌ లైట్లు- పగుల గొట్టి, వికలాంగులుగా నటించడమే కాకుండా లొంగిపోవడం కూడా పథకం ప్రకారం జరిగింది. కాగా, 522 గాజులు, 40 బ్రేస్‌లెట్లు-, 58 చెవి రింగులు, 98 ఉంగరాలు, 33 గొలుసులు, 89 పెండెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.గుంటూరులో ఆనంద్‌కోసం గాలించడానికి వెళ్లిన పోలీసులు అతను అందుబాటులో లేకపోవడంతో బంధువు సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. సుధీర్‌ను అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళన చేపట్టినట్లు సమాచారం. నిందితులు గుంటూరు జిల్లా ఈపూర్‌కు చెందిన గంటెనపాటి ఆనంద్‌, భూమన కిరణ్‌కుమార్‌లు గా పోలీసులు గుర్తించారు. కిరణ్‌ కుమార్‌ పోలీసుల అదుపులో ఉండగా ఆనంద్‌ పరారీలో ఉండటంతో వెస్ట్‌జోన్‌ సీఐ వెంకట్‌ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం ఈపూర్‌ వచ్చారు. నిందితుల బంధువులను విచారించిన అనంతరం ఆనంద్‌ తమ్ముడు సుధీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల క్రితం కిరణ్‌ హైదరాబాద్‌కు వెళ్లగా ఆనంద్‌ 10రోజుల కిత్రమే నగరానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. హైదరాబాద్‌ వెళ్లక ముందు నిందితులు ఈపూర్‌లో మేస్త్రీ పెయింట్‌ పనులు చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *