Tuesday, 3 November 2026

గడువులోగా రాష్ట్రపతికి బిల్లు

87 మంది చర్చలో పాల్గొన్నారు
51 గంటలు చర్చ జరిగింది
స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌
హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి) :
రాష్ట్రపతి ఇచ్చిన గడువులోగా రాష్ట్ర పునర్వ్యస్థీకరణ ముసాయిదాను పంపిస్తామని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. మంగళవారం శాసనసభ అర్ధాంతరంగా వాయిదా పడిన తర్వాత నిర్వహించిన బీఏసీ సమావేశంలో అనధికార తీర్మానాలను అడ్మిట్‌ చేశామని స్పీకర్‌ తెలిపారు. ఆ తీర్మానానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి పంపామని ఆయన స్పష్టం చేశారు. అయితే బీఏసీ సమావేశంలో ప్రాంతాల వారీగా సభ్యులు తమ వాదనలు వినిపించారు. సమావేశం ముగిసిన అనంతరం స్పీకర్‌ విూడియాతో మాట్లాడుతూ, అనధికార తీర్మానాలను అడ్మిట్‌ చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. కాగా, ఎలాంటి తీర్మానాలను అనుమంతిచేది లేదని తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు హెచ్చరించారు. విభజన బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సిన సమయం మరింత దగ్గరకు రావడంతో ప్రాంతాలవారీగా నేతలు గళం విప్పారు. రాష్ట్ర విభజన బిల్లుపై ఓటింగ్‌ తప్పకుండా నిర్వహించాలని వైఎస్సార్‌ సీపీ పట్టుబట్టింది.. 77,78 నిబంధనల కింద తామిచ్చిన తీర్మానాలను సభలో ప్రవేశపెట్టాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేసింది. అసెంబ్లీలో సమైక్య తీర్మానం చేయాలని వైఎస్సార్‌ సీపీ మరోసారి విజ్ఞప్తి చేసింది. కాగా, విభజన బిల్లుపై సీఎం తిరస్కార తీర్మాన నోటీసును ఇవ్వడాన్ని డెప్యూటీ సీఎం, టి.టిడిపి, టి.కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, బీజేపీ, ఎంఐఎంలు తప్పుబట్టాయి. సీఎం ఇచ్చిన నోటీసును పరిశీలించవద్దని టి.కాంగ్రెస్‌ నేతలు కోరుతున్నారు. అసెంబ్లీలో సభ్యుల అభిప్రాయాలు మాత్రమే తీసుకోవాలని టి.నేతలు డిమాండ్‌ చేసారు. తెలంగాణ బిల్లును వెనక్కి పంపాలని కోరుతూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన నోటీసుతో తమకు సంబంధం లేదని డెప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ అన్నారు. బీఏసీ సమావేశంలో మాట్లాడుతూ సీఎం నోటీసును పరిగణనలోకి తీసుకోవద్దని తెలిపారు. మొత్తానికి బిఎసి సమావేశంలోనూ సభ నిర్వహణపై, రాష్ట్ర విభజన బిల్లు చర్చపై భిన్న స్వరాలు విన్పించాయి. ముసాయిదా బిల్లుపై చర్చ ముగిశాకే తీర్మానం గురించి ఆలోచించాలని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ముఖ్యమంత్రి నోటీసు ఉపసంహరించుకుంటేనే చర్చకు సహకరిస్తామని టిఆర్‌ఎస్‌ సభ్యులు తెలిపారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయం కావాలంటే ఓటింగ్‌ పెట్టాల్సిందేనని టిడిపి సభ్యుడు గాలి ముద్దుకృష్ణమనాయుడు అభిప్రాయపడ్డారు. సభలో ఓటింగ్‌ జరగనిదే సభ్యుల అభిప్రాయం తెలియదని ఆయన పేర్కొన్నారు. మిగిలిన రెండు రోజులు కూడా సభ జరగకపోతే ఏం చేస్తారని ఎంఐఎం సభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ సభాపతిని అడిగారు. రాష్ట్రపతి ఈ నెల 30 వరకు గడువిచ్చినందున, అప్పటికి ఏం జరిగితే అదే నివేదిస్తానని స్పీకర్‌ అక్బరుద్దీన్‌కు చెప్పారు. సభలో ఇప్పటి వరకు 87 మంది మాట్లాడారని, 51 గంటల పాటు చర్చ జరిగిందని స్పీకర్‌ వివరించారు. విభజన బిల్లుపై బీఏసీ సమావేశంలో వాడివేడి వాదనలు కొనసాగాయి. విభజన బిల్లును తిరిగి రాష్ట్రపతికి పంపాల్సిన సమయం మరింత దగ్గరకు రావడంతో ప్రాంతాలవారీగా నేతలు గళం విప్పారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమావేశంలో సభ్యుల అభిప్రాయాలను మాత్రమే రాష్ట్రపతికి పంపాలని టి.నేతలు సూచించారు. బిల్లుపై 150 సభ్యలు మాట్లాడాల్సి ఉందని, బిల్లు గడువును మరింత పెంచాలని సీమాంధ్ర నేతలు పట్టుబట్టారు. బిల్లుపై ఓటింగ్‌ ఉండాలని సీమాంధ్ర నాయకులు డిమాండ్‌ చేసారు. తెలంగాణ బిల్లుపై చర్చ జరుగుతుంటే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి నోటీసు ఇవ్వడమేంటని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీలో జరిగిన బీఏసీ సమావేశం అనంతరం ఆయన మీూడియాతో మాట్లాడారు. టీ బిల్లుపై చర్చ ముగిశాక సీమాంధ నేతలు ఎన్ని నోటీసులైన ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇటు అసెంబ్లీలో బిల్లుపై బీఏసీ విూటింగ్‌ జరుగుతూనే ఉండగా అటు సీఎం బిల్లుపై గడువు కోరుతూ లేఖ రాశారని విమర్శించారు. సీఎం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడని దుయ్యబట్టారు. సీఎంకు పదవిలో కొనసాగే నైతిక హక్కులేదని వెంటనే రాజీనామా చేయాలని నాగం డిమాండ్‌ చేశారు. సీమాంధ్ర ప్రాంత నేతలు ఎన్ని కుట్రలు చేసినా సభలో ఏం జరగాలో అదే జరుగుతుందని టీఆర్‌ఎస్‌ శాసనసభపక్ష నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. రెండు గంటలపాటు- సాగిన బీఏసీ సమావేశంలో సీఎం ఇచ్చిన నోటీసును వ్యతిరేకించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై అవసరమైతే ఎల్లుండి 16 గంటలపాటు చర్చించండని సూచించినట్లు ఆయన వివరించారు. సీఎం కిరణ్‌ రాజ్యంగాన్ని, సభను అవమానపరుస్తున్నాడని ఆయన మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *