హైదరాబాద్ : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, బలరాజు మినహా మిగిలిన సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్పీకర్‌కు అఫిడవిట్లు అందించారు. తమ అఫిడవిట్‌లన్నింటినీ రాష్ట్రపతికి పంపాల్సిందిగా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు.




