Tuesday, 3 November 2026

జాగో బాగో నినాదానికి భాజపా వ్యతిరేకం

హైదరాబాద్‌ : జాగో బాగో నినాదానికి భారతీయ జనతపార్టీ పూర్తి వ్యతిరేకమని ఆపార్టీ జాతీయ నేత వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విజయవాడ గాంధీనగర్‌లో నమో టీస్టాల్‌ను ఆయన ప్రారంభించారు. ఇటలీ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చెయ్యొచ్చుగానీ… దేశంలో ఒక ప్రాంతం నుంచి వచ్చి వేరే ప్రాంతంలో నివశిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పోవాలి, భాజపా రావాలి, మోడీ ప్రధాని కావాలని దేశ వ్యాప్తంఆ కోరకుంటున్నారన్నారు. నమో టీస్టాల్‌లో వెంకయ్యనాయుడు టీ కాచి వడబోసి… అందరికీ పంచిపెట్టారు.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *