యానాం : ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల శాఖామంత్రి వి.నారాయణస్వామి ఇంటివద్ద నిలిపి ఉంచిన కారు కింద పేలుడు పదార్ధాలను పోలీసులు గుర్తించారు. పుదుచ్చేరిలోని ఎల్లయమ్మన్ కోయిల్ వీధిలో ఉన్న నారాయణస్వామి ఇంటివద్ద ఉన్న కారు కింద పేలుడు పదార్ధాలు ఉన్నట్లు గుర్తించిన పనిమనిషి పోలీసులకు సమాచారమందించారు. పుదుచ్చేరి డీసీపీ కె. కామరాజ్ సిబ్బందిలో కలిసి మంత్రి ఇంటిని పరిశీలించారు. కారుకింద ఉన్న పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఈ ఘటనతో పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటన జరిగిన సమయంలో కేంద్రమంత్రి కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు.




