Tuesday, 3 November 2026

విభజనకు నేను వ్యతిరేకం :సీఎం

హైదరాబాద్‌: శాసనసభలో బిల్లు పై చర్చ జరుగుతున్న  నేపధ్యంలో సభ రేపటికి వాయిదా పడిన అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లడుతూ విభజనకు తను వ్యతిరేకం అని అన్నారు. బిల్లు పై తమ అభిప్రాయాలను 80 మంది మాత్రమే తెలిపారని ఇంకా అభిప్రాయాలు తెలుపవలసినవాళ్లు ఉన్నారని అన్నారు.దమ్ముంటే ఇదే బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన అన్నారు. మూడు వారాల గడువు అడిగింది అందరి అభిప్రాయాల సేకరణకు,బిల్లులో ఉన్న లోపాలను ఎత్తి చేపడానికేనని సీఎం పేర్కోన్నారు. అసెంబ్లీలో తాను మాట్లాడిన ప్రతి అంశానికీ ఒక ప్రాతిపదిక ఉందన్నారు. ఈ సభకు అధికారం లేదంటున్న వాళ్లు ఓటింగ్‌కు ఎందుకు భయపడుతున్నారని సీఎం ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *