యేల్ విశ్వవిద్యాలయం సర్వేలో వెల్లడి
ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్ : మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం పెరిగి పోతోందని అమెరికాకు చెందిన యేల్ విశ్వవిద్యాలయం తన సర్వేలో తెలిపింది. మొత్తం 178 దేశాల్లో జరిపిన ఈ సర్వే తాలూకు సూచి గ్రీన్ ఇండెక్స్‌లో భారత్ 155వ స్థానంలో ఉంది. చైనా రాజధాని బీజింగ్ కన్నా ఢిల్లీ రెట్టింపు కాలుష్యభరిత నగరమని సర్వే పేర్కొంది. కాలుష్య కారణంగా ఢిల్లీలోని ప్రతి ఐదుగురిలో ఇద్దరు ఊపిరితిత్తుల సమస్యలతో బాదపడుతుఆన్నరని యేల్ సర్వే తెలిపింది. ఢిల్లీలో వాయుకాలుష్యం గత ఏడాదితో పోలిస్తే 44 శాతం పెరిగింది. వాహనాలు, పరిశ్రమల కారణంగానే ఇక్కడ కాలుష్య పెరుగుతోందని తెలుస్తోంది. బ్రిక్ దేశాల్లో చూసినా గ్రీన్ ఇండెక్స్‌లో అన్నికన్నా అధమస్థానంలో భారత ఉంం గమనార్హం.




