Tuesday, 3 November 2026

బిల్లు ఆగదని సీమాంధ్ర నాయకులకు తెలుసు: హరీశ్‌రావు

హైదరాబాద్‌ : విబజన బిల్లు ఆగదని సీమాంధ్ర నాయకులకు తెలుసని, వారు ప్రజలను మోసం చేస్తున్నారని తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడుతూ ఆయన తాము చేస్తున్నది ధర్మపోరాటమని, కచ్చితంగా తెలంగాణ ఏర్పడుతుందని తెలిపారు. రాష్ట్రం విడిపోతుందని సీఎంకు బాగా తెలుసని, అయినా  వూకదంపుడు ఉపన్యాసాలతో కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *