విశాఖపట్నం (జ్ఞానాపురం) : జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాలలో బాంబు ఉందంటూ కలకలం రేగింది. దీంతో పాఠశాల యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. బాంబు స్వ్యాడ్, అగ్ని మాపక సిబ్బంది పాఠశాలకు చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.




