Tuesday, 3 November 2026

అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతోంది

లోటు సగానికి తగ్గిస్తాం : ఓబామా
వాషింగ్టన్‌, జనవరి 29 (జనంసాక్షి) :
అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగు పడుతోందని ఆ దేశాధ్యక్షుడు బరాక్‌ ఒబామా అన్నారు. ఆర్థిక లోటును సగానికి తగ్గిస్తామని ఒబామా తెలిపారు. బుధవారం అమెరికా ఉభయ సభలనుద్దేశించి ఒబామా మాట్లాడారు. ఆర్థిక మాంద్యం తర్వాత అమెరికా క్రమంగా కోలుకుంటోందని, ఇటీవల కాలంలో ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడిందని అన్నారు. పెట్టుబడులకు చైనా కన్నా అమెరికానే ఉత్తమమని పారిశ్రామివేత్తలు భావిస్తున్నారని ఆయన చెప్పారు. అవసరమైనప్పుడు చట్టాలతో పనిలేకుండా చర్యలు తీసుకుంటామని ఒబామా పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను కుదిపేసిందని, దాని ప్రభావం నుంచి అగ్రరాజ్యాన్ని బయట పడేందుకు తమ ప్రభుత్వం ఫెడరల్‌ రిజర్వ్‌కు పూనుకుందని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో అమెరికా పెట్టుబడిదారులు స్టాక్‌ మార్కెట్లలో పెట్టిన డాలర్లను వెనక్కి తీసుకువచ్చామని, దేశ ఆర్థిక అసవరాలకు తగినంతగా ఆర్థిక నిల్వలు సమీకరించామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *