కేజ్రీవాల్ డిమాండ్
న్యూఢిల్లీ, జనవరి 29 (జనంసాక్షి) :
ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన సిక్కుల ఊచకోత వ్యతిరేక ఆందోళనలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను కలిసి చర్చించానని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేక బృందం ఏర్పాటుపై చర్చిస్తామని కేజీవ్రాల్ స్పష్టంచేశారు. అంతకుముందు ఆయన లెఫ్టినెంట్ గవర్నర్‌ను కలిసి చర్చించారు. అల్లర్లకు కారకులైన వారిని శిక్షించాల్సి ఉందన్నారు. 84 సిక్కు వ్యతిరేక అల్లర్లు, 2002 గుజరాత్ దాడుల్లో ప్రభుత్వాల పాత్ర భిన్నంగా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సారధి రాహుల్‌గాంధీ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేజ్రీవాల్ డిమాండ్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సిక్కుల ఊచకోతలో ప్రభుత్వం పాత్ర లేదని, గుజరాత్ దాడులను అక్కడి సర్కారే ప్రోత్సహించిందని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. అలాగే ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్స్‌కు చెందిన తీవ్రవాది దేవిందర్ పాల్ సింగ్ భుల్లార్ ఉరిశిక్ష అమలు చేయాలని తాను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరినట్లు కేజ్రీవాల్ చెప్పారు.
సిక్కుల ఊచకోతపై ‘సిట్’ వేయాలి




