Tuesday, 3 November 2026

విజయం తెలంగాణదే : గండ్ర

హైదరాబాద్‌ : మందబలంతో సీఎం నోటీసును మూజుబాని ఓటుతో ఆమోదించి సీమాంధ్ర నేతలు పైశాచిక ఆనందం పొందవచ్చు కానీ నైతిక విజయం మాత్రం తెలంగాణదేనని చీఫ్‌ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో గండ్ర మాట్లాడుతూ… కిరణ్‌ ఒక్క ప్రాంతానికే పరిమితమయ్యారు. అభిప్రాయం చెప్పాలంటే సీమాంధ్ర నేతలు ఓటింగ్‌ అంటూ డ్రామాలు ఆడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రం నెరవేరుస్తుందని గండ్ర ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *