హైదరాబాద్: శాసనసభలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తవడం ఆనందదాయకమని మంత్రి జానారెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఆర్టికల్ 3 ప్రకారం అసెంబ్లీలో అభిప్రాయం మాత్రమే చెప్పాలని ఎప్పటికప్పుడు గుర్తు చేశామన్నారు. సీఎం తీర్మానం రాజ్యంగ విరుద్ధం, అది కంటి తుడుపు చర్యగా అభివర్ణించారు. సీఎం చర్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. సీఎం డ్రామా ముగిసిందని తెలిపారు. ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.




