హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీ నుంచి ఢిల్లీకి వెళ్లడంతో తెలంగాణ వాదుల్లో సంతోషం వెల్లువెత్తింది. ఈ మేరకు ఇవాళ అసెంబ్లీ ఎదురుగా ఉన్న తెలంగాణ అమరవీరులకు తెలంగాణ నేతలు, విద్యార్థులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. జైతెలంగాణ నినాదాలతో అమరులకు స్మరించుకున్నారు. అమరవీరులారా మీ త్యాగం వధాకాలేదని నినదించారు.




