హైదరాబాద్: తెలంగాణ ఏర్పాటు బిల్లుపై రాష్ట్ర శాసనసభలో మూజువాణి ఓటు నిర్వహించడం పై తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీలో సీమాంధ్ర నేతలు బిల్లుపై మూజువాణి ఓటు చేపట్టడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఇలాంటి తీర్మానాలకు పార్లమెంట్‌లో విలువ ఉండదని పేర్కొన్నారు. టీజీవో నగరశాఖ అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్ ఆధ్వర్యంలో పలువురు నేతలు మాట్లాడారు.




