హైదరాబాద్: తెలంగాణపై విషం కక్కుతున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని తరిమికొట్టాలని హైదరాబాద్‌జిల్లా టీఎన్జీవో నేతలు పిలుపునిచ్చారు. ఇవాళ వాళ్లు నాంపల్లిలోని గృహకల్ప వద్ద రాస్తారోకో నిర్వహించారు. రాజ్యాంగబద్దంగా పదవి చేపట్టిన సీఎం కిరణ్ తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా మూజువాణి ఓటుతో బిల్లును తిరస్కరించడం దారుణమని హైదరాబాద్ జిల్లా సంఘం అధ్యక్షుడు హుస్సేనీ ముజీబ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.




