హైదరాబాద్: వ్యర్థపదార్థాలను సక్రమంగా వినిమోగించుకునే అంశంపై ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగాఈ రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మంత్రి మహీధర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సదస్సుకు బ్రోచర్‌ను విడుదల చేశారు. చెత్త నిర్వహణలో ప్రగతి చూపిన పలు మున్సిపల్ కార్పోరేషన్‌లకు గవర్నర్ బహుమతులు ప్రదానం చేశారు.




