Monday, 2 November 2026

రెబెల్‌ అభ్యర్థులపై మధ్యాహ్నం వరకు వేచిచూస్తాం : దిగ్విజయ్‌

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ ట్టుబడి ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్రులను పట్టించుకోవట్లేదన్న భావన సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజలకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. బిల్లును చెత్తబుట్టలో పడేయాలన్నదానికి తాను అంగీకరించనన్నారు. రాజ్యసభ రెబెల్‌ అభ్యర్థులపై ఈ రోజు మధ్యాహనం 3 గంటల వరకు వేచి చూస్తామని దిగ్విజయ్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *