న్యూఢిల్లీ : స్వర్గీయ జెఎన్ వర్మ కుటుంబం ఆయనకు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మభూషణ్ అవార్డు తిరస్కరించింది. ఈ మేరకు వారు రాష్ట్రపతికి లేఖ రాశారు. జస్టిస్ వర్మ తరపునతాము అవార్డు స్వీకరించలేమని లేఖలో పేర్కొన్నారు. గుర్తింపు, అవార్డుల కోసం వర్మ ఎప్పుడూ పాకులాడలేదన్నారు. ప్రభుత్వం అవార్డు ఇస్తున్నట్లు తమకు అధికారికంగా తెలిజేయలేదని, మీడియా ద్వారా మాత్రమే తెలిసిందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. తమకు ముందే తెలిపి ఉంటే బాగుండేదన్నారు. ఢిల్లీలో నిర్భయ ఘటన అనంతరం మహిళలపై అత్యాచారాలను నివారించే దిశగా కఠినమైన చట్టాలురూపొందించేందుకు ప్రభుత్వం వేసిన కమిటీకి జస్టిస్ వర్మ అధ్యఓత వహించిన సంగతి తెలిసిందే. ఆయనకు ప్రభుత్వం మరణానంతరం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది.




