హైదరాబాద్ : శాసనసభ కమిటీ హాలులో తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. తెలంగాణ కాంగ్రెస్, తె.దే.పా. భాజపా, తెరాస, సీపీఐ ఎమ్మెల్యేలు భేటీలోపాల్గొని సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. శాసనసభలో ఓటింగ్, తీర్మానం జరగకుండా చూడాలని సమావేశంలో నిర్ణయించారు.




