హైదరాబాద్: నిబంధనం ప్రకారం నోటీసు ఇచ్చిన ముఖ్యమంత్రే తీర్మానం ప్రవేశపెట్టాలని, మంత్రులతో చర్చించకుండా సీఎం ఇచ్చిన నోటీసు చెల్లదని స్పీకర్ దృష్టికి తీసుకెళ్లామని శ్రీధర్‌బాబు తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసు శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకమన్నారు. బిల్లును వచ్చే 15 రోజుల్లోగా ఆమోదించేందుకు యూపీఏ ప్రభుత్వం కృషిచేయాలని శ్రీధర్‌బాబు కోరారు.




