వెల్లింగ్టన్ : భారత్-న్యూజీలాండ్ మధ్య జరిగిన ఆఖరి వన్డేలో జైతెలంగాణ నినాదాలు మారుమోగాయి. ప్రేక్షకుల గ్యాలరీలో జైతెలంగాణ బ్యానర్లు వెలిశాయి. వెల్లింగ్టన్‌లో జరిగిన ఆఖరి వన్డేను చూడటానికి న్యజిలాండ్ దేశ నలుమూలలనుంచి తెలుగు వారు వచ్చారు. అందులో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు జైతెలంగాణ బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు.




