
న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) :
కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై మరో భారం మోపింది. చమురు సంస్థలు డీజిల్ ధరను లీటర్‌కు 50 పైసలు పెంచనున్నట్లు ప్రకటించాయి. నెలరోజుల వ్యవధిలోనే ప్రజలపై కేంద్రం డీజిల్ భారాన్ని వేసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి పెంచి ధర అమల్లోకి వస్తుందని చమురు సంస్థలు ప్రకటించాయి. పెట్రోల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదని ప్రకటించాయి. తాజా పెంపుతో లీటర్ డీజిల్ ధర 59.83 రూపాయలకు చేరుకుంది. ఏడాదిలో డీజిల్ ధర ఏకంగా రూ.10 పెరగడం గమనార్హం. జనవరి మొదటి వారంలోనే చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. డీజిల్ ధర పెంపు ప్రభావం ఒక్క చమురుతోనే ఆగకుండా మిగతా అన్ని రంగాలపై పడనుండటంతో సామాన్యులకు మరింత భారం తప్పదు. మరోవైపు నాన్ సబ్సిడీ సిలిండర్ల ధరకు చమురు సంస్థలు రూ.107 తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
స్వల్పంగా పెరిగిన డీజిల్




