Monday, 2 November 2026

మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా హైదరాబాదీ

న్యూయార్క్‌/హైదరాబాద్‌, జనవరి 31 (జనంసాక్షి) :
సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌లో సీఈవో పదవి మన హైదరాబాదీకి దక్కనుందది. మైక్రోసాఫ్ట్‌ కొత్త సీఈవోగా మన హైదరాబాదీ సత్య నాదెళ్ల (46) నియమితులయ్యే అవకాశముందని స్థానిక మీడియా పేర్కొంది. ఆయన నియామకం దాదాపు ఖాయమ యిందని తెలిపాయి. సీఈవో ఎంపిక కోసం ఐదు నెలల పాటు సాగించిన కసరత్తు ముగిసిందని వెల్లడించాయి. సుదీర్ఘకాలంగా సీఈవోగా స్టీవ్‌ బామర్‌స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టే అవకా శముంది. సత్య నాదెళ్ల నియామకం ఖరారయితే మైక్రోసాఫ్ట్‌కు ఆయన మూడో సీఈవో అవుతారు. హైదరాబాద్‌కి చెందిన సత్య మంగళూరు యూనివర్సిటీలో ఎలక్రికల్‌ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చేశారు. అటుపైనా అమెరికాలోని యూనివర్సిటీ ఆప్‌ విస్కాన్సివ్‌ మంచి కంప్యూటర్‌ సైన్‌సలో మాస్టర్స్‌ డిగ్రీ, యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాఫ్ట్‌లో క్లౌడ్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ విభాగానికి ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. మైక్రోస్టాఫ్‌ ప్రస్తుత సీఈవో బామర్‌ వచ్చే ఏడాదిలో రిటైల్‌ కావాలనుకుంటున్నట్లు ప్రకటించినే నేపథ్యంలో వారసుడి అన్వేషణ అనివార్యమైంది. 78 బిలియన్‌ డాలర్ల టర్నోవర్‌గల సంస్థ సీఈవోగా సత్య ఈ ఏడాది సెప్టెంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *