Monday, 2 November 2026

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం

సీడబ్ల్యూసీ తీర్మానానికి ముందు కిరణ్‌ ఎందుకు మాట్లాడలేదు
పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెడతాం
సీమాంధ్ర సమస్యలను పరిష్కరిస్తాం : దిగ్విజయ్‌
న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 31 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు. శుక్రవాం ఆయన ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ బిల్లుకు న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేవని ఆయన మరోసారి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లోని సీమాంధ్ర ప్రజలకు భద్రత కల్పిస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రులను పట్టించుకోవటం లేదన్న భావన సరికాదని, వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో విద్యా, ఉద్యోగ అవకాశాల్లోనూ సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని దిగ్విజయ్‌ తెలిపారు. తెలంగాణ బిల్లును చెత్తబుట్టలో పడేయాలన్న దానిని తాను అంగీకరించనని అన్నారు. రాజ్యసభ రెబల్‌ అభ్యర్థుల విషయంలో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల వరకూ వేచి చూస్తామని తెలిపారు. రాజ్యసభ బరిలో ఉన్న రెబల్‌ అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. కాంగ్రెస్‌ నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. సీమాంధ్రులను పట్టించుకోవట్లేదన్న భావన సరికాదన్నారు. సీమాంధ్ర ప్రజలకు భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లోనూ సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామని వెల్లడించారు. బిల్లును చెత్తబుట్టలో పడేయాలన్నదానికి తాను అంగీకరించనన్నారు. రాజ్యసభ రెబల్‌ అభ్యర్థులపై శుక్రవారం మధ్యాహ్నం 3గంటల వరకు వేచి చూస్తామని దిగ్విజయ్‌ పేర్కొన్నారు. మరోవైపు రెబల్‌ అభ్యర్థులపై ఆయన హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో స్థానిక కాంగ్రెస్‌ నేతలతో చర్చిస్తారు. రాజ్యసభ అభ్యర్థుల విజయం, తెలంగాణ బిల్లు రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. గుల్బర్గా వెళుతూ ఆయన హైదరాబాద్‌లో కాసేపు ఆగుతారు. మరోవైపు సీఎం, సీమాంధ్ర నేతల తీరును దిగ్విజయ్‌సింగ్‌ తప్పుబట్టారు. సీడబ్ల్యూసీ నిర్ణయానికి ముందు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని దిగ్విజయ్‌ తెలిపారు. సీమాంధ్రుల సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ టీ బిల్లును తిరస్కరించంతో జరిగే నష్టమేమి లేదని, అసెంబ్లీ తిరస్కరణ తెలంగాణ పక్రియకు అడ్డంకి కాదని కేంద్ర ¬మంత్రి షిండే తెలిపారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందుతుందని స్పష్టంచేశారు. అనంతరం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మరోవైపు రాష్ట్ర డీజీపీ ప్రసాదరావును కేంద్రం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లారు. టీ.బిల్లును అసెంబ్లీలో తిప్పి పంపిన నేపథ్యంలో డీజీపీ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక కేంద్ర ¬ం మంత్రిత్వ శాఖ సలహాదారు విజయ్‌కుమార్‌ ఈరోజు ఉదయం హైదరాబాద్‌ చేరుకున్నారు. తాను వ్యక్తిగతంగా వచ్చానని ఆయన చెబుతున్నా… విభజన అనంతరం భద్రతపై చర్చించేందుకు వచ్చినట్లు సమాచారం. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా తన అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పారని పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్‌సింగ్‌ శంషాబాద్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రస్తావించిన విద్యుత్‌, నీరు తదితర అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. వీటికి సమాధానం చూపుతామని అన్నారు. తెలంగాణ బిల్లు విషయంలో సీఎం వ్యవహరిస్తున్న తీరును విలేకరులు ఆరా తీశారు. సీఎం కిరణ్‌ రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాలను తాను తెలిపాడని దిగ్విజయ్‌ పేర్కొన్నారు. సీఎం ప్రస్తావించిన విద్యుత్‌, నీరు తదితర అంశాలను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల సమస్యలను ప్రస్తావించడంలో తప్పు లేదన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వారికి అన్నిరకాలుగా అండగా ఉంటామన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్ర ప్రజలకు కూడా విద్య, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని పేర్కొన్నారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి అధినేత చంద్రబాబు, వైకాపా అధ్యక్షుడు జగన్‌లు గతంలో లేఖలు ఇచ్చారని గుర్తుచేశారు. వారు ఇప్పుడు దాన్ని కాదని మాట మారిస్తే తాము ఏమీ చేయలేమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా గతంలోనే టీడీపీ, వైసీసీలు లేఖలు ఇచ్చాయని దిగ్విజయ్‌సింగ్‌ పునరుద్ఘాటించారు. కానీ ఇవాళ వాళ్లు మళ్లీ మాట మార్చితే తానేం చేయాలని ప్రశ్నించారు. విలేకరులు ఆయనను చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. జగన్‌, బాబులు మాటమార్చి మాట్లాడితే తాము మాట మార్చలేమన్నారు. ఇదిలావుంటే రాజ్యసభ ఎన్నికలపై ఆయన కాంగ్రెస్‌ నేతలతో ఆరా తీసారు. పోటీలో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థులు కెవిపి, టిఎస్సార్‌, ఖాన్‌లతో ఆయన విడివిడిగా సమావేశమయ్యారు. తెలంగాణ నేతలు కూడా ఆయనతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు భేటీ అయ్యారు. ఆయన శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకోగానే నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయంలోనే ఆయన నేతలతో విడివిడిగా చర్చలు జరిపారు. మంత్రి జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ ఆలీ దిగ్విజయ్‌ని కలిసి చర్చించిన వారిలో ఉన్నారు. ఇదిలావుంటే దిగ్విజయ్‌సింగ్‌ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మంత్రి విూడియాతో మాట్లాడుతూ దిగ్విజయ్‌పై మండిపడ్డారు. మీరేం చేసినా మేం చేసేది చేస్తాం అన్నట్లు దిగ్విజయ్‌ మాట్లాడటం అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులు అందరం ఢిల్లీ వెళ్తామని.. ఒక రోజు మౌన దీక్ష చేస్తామని తెలిపారు. మౌనదీక్ష స్థలం నుంచి పాదయాత్రగా రాష్ట్రపతి వద్దకు వెళ్లి వినతి పత్రం అందిస్తామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *