హైదరాబాద్ : మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ మెయిల్‌ను హ్యాక్‌చేసి డబ్బు కాజేసిన కేసులో నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడ్ని కోల్‌కతా సాల్ట్‌లేక్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మణ్ బ్యాంకు ఖాతా నుంచి రూ. 10 లక్షలు కాజేసేందుకునిందితుడు యత్నించాడు. నిందితుడు ఈ మెయిల్ ద్వారా హ్యాక్ చేసిన ఖాతా నుంచి రూ. 45వేలు ఏటీఎం ద్వారా డ్రాచేసినట్లు పోలీసులు గుర్తించారు. లక్ష్మణ్ ఫిర్యాదు చేసిన 24 గంటల్లోపే కేసును ఛేదించామని సైబరాబాద్ అదనపు డీసీసీ జానకి షర్మిళ తెలిపారు.




