హైదరాబాద్ : తెలంగాణపై తమ పార్టీ విధానం మారలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌కారత్ అన్నారు. హైదరాబాద్లఓ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకు మూడో ఫ్రంట్ ఆలోచన లేదన్నారు. కాంగ్రెస్, భాజపాయేతర పార్టీలను కలుపుకొనే ప్రయత్నంలో ఉన్నామని వెల్లడించారు. వైకాపాను సెక్యులర్ పార్టీగానే భావిస్తున్నామని, పొత్తులపై నిర్ణయం జరగలేదన్నారు. 8 రాష్ట్రాల్లో 35 స్థానాల్లో పోటీకి ప్రాధమికంగా నిర్ణయించినట్లు చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధికోసమే మహిళా రిజర్వేషన్ బిల్లు, మతహింస నిరోధక బిల్లు తేవాలని భావిస్తోందన్నారు.




