Monday, 2 November 2026

అసెంబ్లీ నుంచి చీఫ్‌ సెక్రెటరీకి

రేపు రాష్ట్రపతికి టీ బిల్లు
హస్తిన బాట పట్టిన నేతలు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :
ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు అసెంబ్లీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి చేరింది. రాష్ట్ర శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్‌ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పికె మహంతికి పంపారు. శాసనసభలో చర్చల సారాంశం, తీర్మానాలను క్రోడీకరించి అందులో పొందుపరిచారు. సభలో సభ్యులు అందరూ బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయని విషయం తెలిసిందే. విభజన బిల్లు కేంద్రం నుంచి ప్రత్యేక విమానంలో తెచ్చి నేరుగా మహంతికే అప్పగించారు. ఇప్పుడు దానిని పంపించే బాధ్యత కూడా ఆయనదే. ఈ బిల్లును మహంతి కేంద్ర ¬ం శాఖకు పంపించే ఏర్పాట్లు చేస్తారు. ఇదిలావుంటే తెలంగాణ ముసాయిదా బిల్లు సోమవారం రాష్ట్రపతికి చేరనున్నట్లు తెలుస్తోంది. విభజన బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సభ్యుల అభిప్రాయాల నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ పక్రియ అంతా వేగంగా చేస్తున్నారు. సోమవారం తుది నివేదికను రాష్ట్రపతికి పంపడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీనికి అనుగుణంగా కార్యాచరణకు కకూడా సన్నద్దం అవుతున్నారు. ఆంధప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లును డిసెంబర్‌ 16వ తేదీన ప్రవేశ పెట్టారు. సభ్యులు ప్రతిపాదించిన 9,072 సవరణలు, 250 లిఖిత పూర్వకమైన అభిప్రాయాలు తెలిపారు. 86మంది సభ్యులు మాట్లాడారు. శాసనసభ వ్యవహారాల కమిటీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ అధికారిక రికార్డులన్నింటినీ సభ అభిప్రాయంగా రాష్ట్రపతికి పంపుతామని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు పార్టీలన్నీ ఢిల్లీ బాట పట్టనున్నాయి. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయా పార్టీలు తమ సభ్యులతో సుదీర్ఘంగా చర్చిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతామని ¬మంత్రి షిండే, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి అభిషేక్‌సింఘ్వీ ఇప్పటికే స్పష్టంచేశారు. తెలంగాణ ఏర్పాటుకు తమ ప్రభుత్వం కట్టు-బడి ఉందని.. ఆ దిశగా యూపీఏ సర్కారు ఇప్పటికే ముందడుగు వేసిందని చెప్పారు. బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాక ఏ మేరకు సహకరిస్తాయన్నది చూడాలని, అప్పుడు ఆ పార్టీల రంగు బయటపడుతుందని పరోక్షంగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్ర విభజన బిల్లును తిరస్కరిస్తున్నట్లు శాసనసభలో తీర్మానం చేయటం గురించి ప్రస్తావించగా.. ఇది అనూహ్యమైన పరిణామేవిూ కాదని వీరు చెప్పిన సంగతి తెలిసిందే. విభజనకు సంబంధించి రాష్ట్రం ముందుగా సమ్మతి తెలపాల్సిన అవసరం లేనప్పటికీ.. సంబంధిత పక్రియను తాము విశ్వసిస్తాం కాబట్టి ఆ పక్రియను తాము జాగ్రత్తగా పూర్తిచేశామన్నారు. బిల్లును అసెంబ్లీ తిరస్కరించటం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌ పార్టీ కోర్‌ కమిటీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో సమావేశమైంది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర సీనియర్‌ నేతలతో పాటు ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలు కానున్న పార్లమెంటు సమావేశాల ఎజెండాలో.. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌, ఆరు అవినీతి వ్యతిరేక బిల్లుల ఆమోదంతో పాటు.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం కీలకమైన మూడు అంశాలుగా ఉంటాయని ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు ఒకరు పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణ ముసాయిదా బిల్లు వ్యవహారం ఢిల్లీకి చేరింది. తెలంగాణ రాజకీయాల దృశ్యం హైదరాబాదు నుంచి దేశ రాజధాని ఢిల్లీకి మారింది. దీంతో ఢిల్లీలో రాజకీయాలు వేడెక్కాయి. వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రతిపాదించి, ఆమోదింపజేసుకోవడానికి కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా, దాన్ని అడ్డుకోవడానికి ఢిల్లీలో ప్రయత్నాలు సాగించే పనిలో సీమాంధ్ర నేతలు పడ్డారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌ నాథ్‌ 3వ తేదీన అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే విధంగా 4వ తేదీన స్పీకర్‌ మీరాకుమార్‌ ఫ్లోర్‌ లీడర్ల సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ బిల్లుపై 4వ తేదీన మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన ఈ నెల 4వ తేదీన ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను కలుస్తున్నారు. ఇతర జాతీయ పార్టీల నేతలను కూడా కలిసి తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగించున్నారు. ప్రధానికి ఇవ్వాల్సిన వినతిపత్రం రూపకల్పనకు కేసీఆర్‌ తన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తెలంగాణ కాంగ్రెసు నేతలు ఆదివారం ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నారు. కాగా, కాంగ్రెస్‌ సీమాంధ్ర నేతలు కూడా 3వ తేదీన ఢిల్లీ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ నెల 4,5 తేదీల్లో తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు కోరారు. తెలుగదేశం పార్లమెంటు సభ్యులు కూడా రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌ కోరుతున్నారు. అపాయింట్‌మెంట్‌ ఇస్తే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల పార్లమెంటు సభ్యులతో రాష్ట్రపతిని కలుస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *