14 మంది మృతి
జకార్తా, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :
ఇండోనేసియాలోని సుమత్రా ద్వీపంలో మరో అగ్ని పర్వతం పేలింది. పెద్ద ఎత్తున పొగలు, మంటలతో కూడిన లావా ఎగసి పండింది. దీంతో 14మంది ప్రాణాలు కోల్పోయారు. సుమత్రాలోని సినబంగ్ అగ్నిపర్వతం కొన్నేళ్లుగా అప్పుడప్పుడు లావాను వెదజల్లుతోంది. గత సెప్టెంబరులో జరిగిన పేలుడుతో దాదాపు 30 వేలమందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. తాజాగా మళ్లీ పేలడంతో వేలాదిమంది సురక్షితప్రాంతాలకు తరలివెళ్తున్నారు. తరచూ అగ్ని ప్రమాదాలు పేలుతుండటంతో ఇక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు.
ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం





