కరీంనగర్ : సీమాంధ్రకు చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్రమంత్రి చిరంజీవి ఇవాళ కరీంనగర్ జిల్లా ఎలగందుల ఖిల్లాలో సౌండ్ మరియు లైట్‌షోను ప్రారంభించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ – పార్లమెంట్‌లో టీ బిల్లుకు చిరంజీవి సహకరించాలని కోరారు. దీనికి స్పందించిన చిరంజీవి ఎంపీ పొన్నంను రెబల్‌స్టార్‌గా అభివర్ణించారు. కేంద్రమంత్రిగా అన్ని రాష్ట్రాలు, ప్రాంతాలు తమకు కావాలన్నారు. తమకు ప్రాంతాలు, రాజకీయాలు వర్తించవని ఆయన పేర్కోన్నారు.




