Tuesday, 3 November 2026

నెలాఖరుకు నోటిఫికేషన్‌

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌
శ్రీకాకుళం, ఫిబ్రవరి 2 (జనంసాక్షి) :
ఈ నెలాఖరులోగా రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ తెలిపారు. సాధారణ ఎన్నికలకు ఫిబ్రవరి నెలాఖరులో గానీ మర్చి మొదటి వారంలో గానీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశముందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ బన్వర్‌లాల్‌ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఆదివారం ఉదయం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించారు. అనంతరం బన్వర్‌లాల్‌ మాట్లాడుతూ.. జనవరి 31న జిల్లాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశామని రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 72 లక్షల మంది నమోదు చేసుకున్నారు. పేర్కొన్నారు. వీరిలో 35 లక్షల మంది యువత కొత్తగా ఓటు కోసం నమోదు చేసుకున్నారని ఆయన తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలోని 294 అసెంబ్లీ స్థానాలకు, 42 పార్లమెంటరీ స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరులో గానీ మార్చి మొదటి వారంలో గానీ ప్రకటన విడుదల చేసే అవకాశముందని బన్వర్‌లాల్‌ చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు. అధికారులతో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *