Tuesday, 3 November 2026

ఔరంగాబాద్‌లో పేలుడు నలుగురు మృతి

హైదరాబాద్‌: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ పట్టణంలో ఫ్యాబ్రికేషన్‌ వర్క్‌షాపులో పేలుడు సంభవించడంతో యాజమాని సహానలుగురు వ్యక్తులు మరణించారు. మరి కొంతమంది తీవ్రగాయాల పాలైనట్లు సోమవారం పోలీసులు వెల్లడించారు. ఈ పేలుడు వల్ల బషీర్‌నగర్‌ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని పోలీసు కమీషనర్‌ సంజయ్‌కుమార్‌ తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ పేలడం వల్లే ఈ ఘటన సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కచ్చితమైన కారణాలు తెలియాల్సిఉంది. మృతులు షేక్‌ రఫీక్‌ అహ్మద్‌(30), ఖాన్‌ మజీద్‌ హయ్యత్‌(52), షేక్‌ ముజాఫర్‌ అహ్మద్‌ (22), సిరాజ్‌ ఖాన్‌(3)లుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను స్థానికి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *