హైదరాబాద్: కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆడిస్తున్న నాటకంలో భాగమే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టనున్న దీక్ష అని భాజాపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ప్రక్రియను అడ్డుకునేందుకు కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందన్నారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత,భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలంగాణకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.




