
తెలంగాణ కల సాకారం కాబోతుంది : అజిత్‌సింగ్
అడ్డుకుంటే కాంగ్రెస్, భాజపా మూల్యం చెల్లించకతప్పదు : సురవరం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రజలు దశాబ్దాల తరబడి ఎదురుచూస్తోన్న ప్రత్యేక రాష్ట్ర కల సాకారం కాబోతుంది. ఎన్నాల్లో వేచిన ఉదయం త్వరలోనే వస్తుందని రాష్ట్రీయ లోక్‌దళ్ అధినేత కేంద్ర మంత్రి అజిత్‌సింగ్ చెప్పారు. మరోవైపు తెలంగాణపై బీజేపీ వెనక్కివెళ్లదని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విశ్వాసం వ్యక్తం చేశారు. ఆ అవసరం బీజేపీకి లేదన్నారు. ఇంతదాకా వచ్చాక ఇప్పుడు బిజెపి ఎందుకు మెలిక పెడుతుందని ప్రశ్నించారు. సోమవారం నాడిక్కడ ఆయన కేంద్రమంత్రి అజిత్‌సింగ్‌ను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు మద్ధతునిస్తూనే ఉందని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని సుష్మా స్వరాజ్ కూడా చాలాసార్లు స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఆపార్టీ వైఖరిలో మార్పు ఉండబోదని పేర్కొన్నారు. హస్తినలో తెలంగాణ బిల్లుకు మద్దతుకూడగడుతున్న కేసీఆర్ తాజాగా రాష్టీయ్ర లోక్‌దళ్ పార్టీ మద్దతు కుడగట్టారు. ఆర్‌ఎల్‌డీ నేత అజిత్‌సింగ్ నివాసానికి కేసీఆర్ వెళ్లి అజిత్‌సింగ్‌తో భేటీ అయ్యారు. అనంతరం వారిద్దరు మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి ఆర్‌ఎల్‌డీ తెలంగాణకు మద్దతు ఇస్తోందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం ఖాయమని అజిత్‌సింగ్ ఈ సందర్భంగా అన్నారు.ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలంగాణ సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అభినందనీయులు అని అజిత్ సింగ్ అభినందించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టడంలో భాగంగా కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం అజిత్‌సింగ్‌ను కలిశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు తాము మద్దతిస్తామని చెప్పారు. త్వరలో తెలంగాణ సాకారం అవనుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. త్వరలో తెలంగాణ సాకారం అవనుందన్నారు. ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో దేశాలకన్నా ఉత్తరప్రవేశ్ చాలా పెదద్దని అన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం యూపిని విడగొట్టాలని కోరుతున్నామని, దానికి కేసీఆర్ సహకరాం కూడా కావాలన్నారు. బిల్లుకు పార్లమెంటులో మద్దతిస్తామని భారతీయ జనతా పార్టీ లోకసభ పక్ష నేత సుష్మా స్వరాజ్ స్పష్టంగా చెప్పారని కెసిఆర్ మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ బిల్లు పైన పార్లమెంటులో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనప్పటికీ తాము అధిగమిస్తామన్నారు. ఆర్‌ఎల్డీ మొదటి నుంచి తెలంగాణకు కట్టుబడి ఉందన్నారు. పార్లమెంటులో బిల్లు కచ్చితంగా ఆమోదం పొంది తీరుతుందన్నారు. కాగా, కేసీఆర్ మంగళవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను తెలంగాణ అంశంపై కలువనున్నారు.
పార్లమెంటు సమావేశాలను అడ్డుకుని తెలంగాణ బిల్లు రాకుండా చూడాలని కొందరు యత్నిస్తున్నారని సీపీఐ జాతీయకార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఈ ప్రయత్నాలను తిప్పికొట్టి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ఈ బాధ్యతను తీసుకోవాలన్నారు. ఇచ్చిన హావిూకి కట్టుబడి బిల్లు వచ్చేలా చేయాల్సి ఉందన్నారు. బిల్లుకు ఆమోదం లభించేలా కాంగ్రెస్, బిజెపిలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలన్నారు. మూజువాణి ఓటుతో నెగ్గిన శాసనసభ తీర్మానానికి విలువ లేదన్నారు. ఆర్థిక బిల్లు తర్వాత రెండో బిల్లుగా తెలంగాణ బిల్లును ప్రతిపాదిస్తున్నారని సురవరం అన్నారు. రాష్ట్ర సమైక్యత తప్ప మిగతా సమస్యలపై సీమాంధ్రులకు సీపీఐ న్యాయం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్నది కూడా తమ అభిమతమన్నారు. కానీ ఇంతదాకా వచ్చాక ఇంకా బిల్లురు అడ్డ్‌ఉకోవాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు సరికావన్నారు.
ఎన్నాల్లో వేచిన ఉదయం




