న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 : దేశ విశిష్ట పురస్కారం భారతరత్నను రసాయనశాస్త్రవేత్త సిఎన్‌ఆర్ రావుకు భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి మంగళవారం ఉదయం అందజేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌హాలులో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు. ప్రముఖ శాస్త్రవేత్త సిఎన్‌ఆర్‌రావుకు, క్రీడారంగంలో విశిష్ట సేవలందించినందుకుగాను సచిన్ రమేష్ తెండూల్కర్‌కు భారతరత్న ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర మంత్రులు గులాంనబి ఆజాద్, ఆంటోని, తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉండగా భారతరత్న అందుకున్న తొలి క్రీడాకారునిగా సచిన్ తెండూల్కర్ చరిత్రలో నిలిచిపోనున్నారు. అంతేగాక భారత రత్న అందుకున్న వారిలో అతి పిన్న వయస్కుడు కూడా ఆయనే. గతేడాది నవంబర్ 18న క్రికెట్ ఆటకు సచిన్ సెలవు ప్రకటించడం.. అదే రోజున భారత ప్రభుత్వం ఆయనకు భారతరత్న అవార్డు ప్రకటించడం తెలిసిందే.




