Tuesday, 3 November 2026

విద్యుత్‌సౌధ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా

పంజాగుట్ట (హైదరాబాద్‌) : ఏపి. జెన్‌కో కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌ సౌధ వద్ద మహాధర్నా చేపట్టారు. ఈ కార్య్కమంలో విద్యుత్‌ ఐక్య పోరాట వేదిక ఐకాస కన్వీనర్‌ వి.సుబ్బిరెడ్డి మాట్లాడుతూ… థర్మల్‌ హైడల్‌ కేంద్రాల్లో పనిచేస్తున్న 4,500 మంది కాంట్రాక్టు కార్మికుల శ్రమను ఈ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని విమర్శించారు. రెగ్యులర్‌ ఉద్యోగులకు రూ. 25వేల నుంచి 35 వేల వేతనం ఇస్తున్న ఈ ప్రభుత్వం వారు చేసే పనినే తాము చేస్తున్నప్పటికీ, కేవలం తమకు రూ. 5,500ల నుంచి రూ. 6,500లు ఇచ్చి నిలువు దోపిడీ చేస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో ఐకాస ప్రతినిధులు గంగయ్య మహేశ్వరరెడ్డి, నారాయణ రెడ్డి శ్రీరాములు తదితరులు పాల్గన్నారు. కాంట్రాక్టు కార్మికులు కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *