ఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కేసీఆర్ నేతృత్వంలోని తెరాస బృందం భేటీ ముగిసింది. అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ… బిల్లులో సవరణలు కూడా ప్రధానికి వివరించినట్లు చెప్పారు. తెలంగాణ బిల్లును కచ్చితంగా ఈ సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెడతామని ప్రధాని చెప్పారని కేసీఆర్ వివరించారు. తమ అభ్యర్ధనను లిఖిత పూర్వకంగా ప్రధానికి తెలియజేశామన్నారు. ఏపీ భవన్ ఉదోఓయగులు, పెన్షనర్లు, విద్యుత్, ఉన్నత విద్య అంశాలను, గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల అంవాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. పార్లమెంట్ బీఏసీ సమావేశం తర్వాత అన్ని విషయాలపై స్పందిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.




